Gold Rates: సామాన్యులను శపించిన పసిడి ధరలు..!!
Gold Price Today: క్రమంగా కుదుటపడుతున్న ఆర్థిక పరిస్థితులతో పసిడి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2024లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.70 వేల మార్కును అందుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆభరణాలు కొనాలనుకునే వారికి పెద్ద షాక్ అని చెప్పుకోవాలి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.350 పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,350, ముంబైలో రూ.57,750, దిల్లీలో రూ.57,900, కలకత్తాలో రూ.57,750, బెంగళూరులో రూ.57,750, పూణేలో రూ.57,750, కేరళలో రూ.57,750, వడోదరలో రూ.57,800, జైపూరులో రూ.57,900, కోయంబత్తూరు రూ.58,350, నాశిక్ లో రూ.57,780, మైసూరులో రూ.57,750గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.380 మేర క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,650, ముంబైలో రూ.63,000, దిల్లీలో రూ.63,150, కలకత్తాలో రూ.63,000, బెంగళూరులో రూ.63,000, పూణేలో రూ.63,000, కేరళలో రూ.63,000, వడోదరలో రూ.63,050, జైపూరులో రూ.63,150, కోయంబత్తూరు రూ.63,650, నాశిక్ లో రూ.63,030, మైసూరులో రూ.63,000 వద్ద ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, అనంతపురం, విశాఖ, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, కడప, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,750గా ఉండగా.. 24 క్యారెట్లో గోల్డ్ ధర రూ.63,000గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.1000 పెరిగి రిటైల్ విక్రయ ధర రూ.80,200గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications