Gold Rate: గూబ గుయ్‍య్ మనిపిస్తున్న గోల్డ్.. నేడు రూ.1,100 పెరిగిన ధర, ఏపీ తెలంగాణలో రేట్లిలా
Gold Price Today: పసిడి ధరలు నిన్న చిన్న బ్రేక్ తీసుకుని స్థిరంగా కొనసాగినప్పటికీ నేడు తమ పెరుగుదల జోరును కొనసాగించాయి. దీంతో పసిడి ప్రియులు షాపింగ్ చేయాలంటే మళ్లీ ధరల పెరుగుదలతో జంకుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావటం వల్ల శుభకార్యాల కోసంతో పాటుగా.. సంక్రాంతి, క్రిస్టమస్ సందర్భంగా చాలా మంది తమ షాపింగ్ ప్లానింగ్ చేసుకుంటున్న వేళ గోల్డ్ మళ్లీ స్థిరంగా పెరుగుతో పోతోంది. ఈ క్రమంలో నేడు కొనుగోలుకు వెళ్లే ముందు తప్పనిసరిగా మీ నగరంలో ధరలను చూడటం ఉత్తమం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.1000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7140, ముంబైలో రూ.7140, దిల్లీలో రూ.7155, కలకత్తాలో రూ.7140, బెంగళూరులో రూ.7140, కేరళలో రూ.7140, వడోదరలో రూ.7145, అహ్మదాబాదులో రూ.7145, జైపూరులో రూ.7144, లక్నోలో రూ.7144, కోయంబత్తూరులో రూ.7140, పూణేలో రూ.7134, మంగళూరులో రూ.7140, నాశిక్‍లో రూ.7143, అయోధ్యలో రూ.7144, బళ్లారిలో రూ.7140, గురుగ్రాములో రూ.7144, నోయిడాలో రూ.7144 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1,100 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన పసిడి విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7789, ముంబైలో రూ.7789, దిల్లీలో రూ.7804, కలకత్తాలో రూ.7789, బెంగళూరులో రూ.7789, కేరళలో రూ.7789, వడోదరలో రూ.7794, అహ్మదాబాదులో రూ.7794, జైపూరులో రూ.7792, లక్నోలో రూ.7792, కోయంబత్తూరులో రూ.7789, పాట్నాలో రూ.7780, మంగళూరులో రూ.7789, నాశిక్‍లో రూ.7783, అయోధ్యలో రూ.7792, బళ్లారిలో రూ.7789, గురుగ్రాములో రూ.7792, నోయిడాలో రూ.7792గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7140గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7789 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7140గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7789 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 పెరిగి రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications