Gold Rate: 2వ రోజూ రివర్స్‌లోనే గోల్డ్ ధరలు.. శుభసమయంలో రూ.7600 పెరిగిన పసిడి రేటు..
Gold Price Today: ప్రస్తుతం భారీగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గడచిన వారం నిరంతరం తగ్గిన గోల్డ్ ధరలు ప్రస్తుతం పెరుగటం కొనసాగిస్తున్నాయి. ఈవారం మెుదటి నుంచి పసిడి ధరల పెరుగుదల ఒక్కసారిగా ఊపందుకోవటంతో చాలా మంది కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. మరింతగా రేట్ల తగ్గింపుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చాలా మంది రేట్ల పెరుగుదలతో గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలో నేడు షాపింగ్ చేసేవారు తప్పనిసరిగా ఏపీ, తెలంగాణలో రేట్లను ముందుగా పరిశీలించటం ముఖ్యం..
కార్తీకమాసంతో పాటు పెళ్లిళ్ల సమయంలో నేటి పసిడి ధరలను గమనిస్తే.. 22 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.7000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7065, ముంబైలో రూ.7065, దిల్లీలో రూ.7080, కలకత్తాలో రూ.7065, బెంగళూరులో రూ.7065, కేరళలో రూ.7065, పూణేలో రూ.7065, వడోదరలో రూ.7070, అహ్మదాబాదులో రూ.7070, జైపూరులో రూ.7011, లక్నోలో రూ.7011, కోయంబత్తూరులో రూ.6996, మంగళూరులో రూ.7065, నాశిక్ లో రూ.7068, మైసూరులో రూ.7065, అయోధ్యలో రూ.7080, బళ్లారిలో రూ.7065, గురుగ్రాములో రూ.7080, నోయిడాలో రూ.7080 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.7600 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ అమ్మకపు ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7707, ముంబైలో రూ.7707, దిల్లీలో రూ.7722, కలకత్తాలో రూ.7707, బెంగళూరులో రూ.7707, కేరళలో రూ.7707, పూణేలో రూ.7707, వడోదరలో రూ.7712, అహ్మదాబాదులో రూ.7712, జైపూరులో రూ.7647, లక్నోలో రూ.7647, కోయంబత్తూరులో రూ.7632, మంగళూరులో రూ.7707, నాశిక్ లో రూ.7710, మైసూరులో రూ.7707, అయోధ్యలో రూ.7722, బళ్లారిలో రూ.7707, గురుగ్రాములో రూ.7722, నోయిడాలో రూ.7722గా ఉన్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7065గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7707 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7707గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7631 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2000 పెరిగి రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications