Gold Rate: చలికాలంలో పసిడి ధరలకు ట్రంప్ దెబ్బ.. రూ.3,300 అప్, హైదరాబాదులో రేటెంతంటే?
Gold Price Today: చలికాలంలో మనుషులు చలికి వణుకుతుంటారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎంట్రీ నుంచి పసిడి ధరలు ప్రజలను వణికిస్తున్నాయి. అవునండి బాబు జనవరి 1 తర్వాతి నుంచి గోల్డ్ రేట్లు నిరంతర పెరుగుదలతో భారతీయ కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు.
ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3,000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గ్రాముకు చెన్నైలో రూ.7555, ముంబైలో రూ.7555, దిల్లీలో రూ.7570, కలకత్తాలో రూ.7555, బెంగళూరులో రూ.7555, వడోదరలో రూ.7560, అహ్మదాబాదులో రూ.7560, జైపూరులో రూ.7570, మంగళూరులో రూ.7555, నాశిక్‌లో రూ.7558, బళ్లారిలో రూ.7555, గురుగ్రాములో రూ.7570, అయోధ్యలో రూ.7570, నోయిడాలో రూ.7570గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.3,300 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8242, ముంబైలో రూ.8242, దిల్లీలో రూ.8257, కలకత్తాలో రూ.8242, బెంగళూరులో రూ.8242, వడోదరలో రూ.8247, అహ్మదాబాదులో రూ.7560, జైపూరులో రూ.8257, మంగళూరులో రూ.8242, నాశిక్‌లో రూ.8245, బళ్లారిలో రూ.8242, గురుగ్రాములో రూ.8257, అయోధ్యలో రూ.8257, నోయిడాలో రూ.8257 వద్ద ఉన్నాయి.
హైదరాబాదులో గోల్డ్-సిల్వర్ ధరలు..
తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7555గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8242 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో తెలంగాణలో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే కేజీకి రేటు రూ.1000 పెరగటంతో రూ.1,05,000 వద్ద కొనసాగుతోంది. వాస్తవానికి పైన పేర్కొన్న రేట్లకు జీఎస్టీ, తయారీ మజూరి, తరుగు వంటి అదనపు ఖర్చులు ఉంటాయని వినియోగదారులు గమనించాలి.


Click it and Unblock the Notifications