Gold Rate: పండుగ రోజు గోల్ట్ రేట్లు షాక్.. పసిడి రూ.2700 అప్, షాపింగ్ బంద్..!!
Gold Price Today: దేశవ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు తోచినంతలో కొంత బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి పెద్ద షాక్ తగిలింది. వారాంతంలో సైతం పసిడి ధరలు అమాంతం పెరిగి ధనవంతులను సైతం హడలెత్తిస్తున్నాయి. రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లతో నవరాత్రులు, దీపావళి, పెళ్లిళ్లకు ఆభరణాలు కొనాలనుకుంటున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక మంది అత్యవసరం కాకుంటే ధరల తగ్గే వరకు వేచి ఉండాలని చూస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2500 పెరుగుదలను చూసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7120, ముంబైలో రూ.7120, దిల్లీలో రూ.7135, కలకత్తాలో రూ.7120, బెంగళూరులో రూ.7120, కేరళలో రూ.7120, వడోదరలో రూ.7125, జైపూరులో రూ.7135, లక్నోలో రూ.7135, మంగళూరులో రూ.7120, నాశిక్ లో రూ.7123, అయోధ్యలో రూ.7135, బళ్లారిలో రూ.7120, గురుగ్రాములో రూ.7135, నోయిడాలో రూ.7135 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. పైన పేర్కొన్న ధరల్లో జీఎస్టీ, వ్యాపారుల మార్జిన్లు, తరుగు, మజూరి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోక ముందు రేట్లుగా గమనించాలి. వాస్తవానికి ఆభరణాలు లేదా బిస్కెట్ల కొనుగోలులో రేట్ల తేడా వివిధ ప్రాంతాల్లో వ్యాపారులకు తగినట్లుగా ఉంటాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్లో గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2700 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ నేటి విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7767, ముంబైలో రూ.7767, దిల్లీలో రూ.7782, కలకత్తాలో రూ.7767, బెంగళూరులో రూ.7767, కేరళలో రూ.7767, వడోదరలో రూ.7772, జైపూరులో రూ.7782, లక్నోలో రూ.7782, మంగళూరులో రూ.7767, నాశిక్ లో రూ.7770, అయోధ్యలో రూ.7782, బళ్లారిలో రూ.7767, గురుగ్రాములో రూ.7782, నోయిడాలో రూ.7782గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7120గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7767 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 పెరిగి రూ.1,03,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు మరియు మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications