Gold Price Today: వరుసగా మూడవ రోజు సైతం బంగారం ధరలు దేశీయంగా భారీ పెరుగుదలను చూశాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠాల దిశగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. మరో పక్క సెంట్రల్ బ్యాంకులు సైతం తమ కొనుగోళ్లను నిరంతరాయంగా కొనసాగించటం రేట్లను ప్రేరేపిస్తోంది. ప్రస్తుత పెరుగుదలతో వారాంతంలో షాపింగ్ కోసం వెళదామని భావిస్తున్న భారతీయ పసిడి ప్రియులు నేడు పెరిగిన రేట్లతో హవాక్ అవుతున్నారు. దాదాపుగా గ్రాము రేటు 8000ల రూపాయలకు చేరువలోకి రావటం గందరగోళానికి గురిచేస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.8000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన పసిడి రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7240, ముంబైలో రూ.7240, దిల్లీలో రూ.7255, కలకత్తాలో రూ.7240, బెంగళూరులో రూ.7240, కేరళలో రూ.7240, వడోదరలో రూ.7245, అహ్మదాబాదులో రూ.7245, జైపూరులో రూ.7255, మంగళూరులో రూ.7240, నాశిక్ లో రూ.7243, అయోధ్యలో రూ.7255, బళ్లారిలో రూ.7240, గురుగ్రాములో రూ.7255, నోయిడాలో రూ.7255 వద్ద ఉన్నాయి. పైన పేర్కొన్న రేట్లు జీఎస్టీ, తరుగు, గోల్డ్ షాపుల లాభాలు వంచి ఖర్చులకు ముందు రేట్లని గుర్తుంచుకోండి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.8700 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7898, ముంబైలో రూ.7898, దిల్లీలో రూ.7913, కలకత్తాలో రూ.7898, బెంగళూరులో రూ.7898, కేరళలో రూ.7898, వడోదరలో రూ.7903, అహ్మదాబాదులో రూ.7903, జైపూరులో రూ.7913, మంగళూరులో రూ.7898, నాశిక్ లో రూ.7901, అయోధ్యలో రూ.7913, బళ్లారిలో రూ.7898, గురుగ్రాములో రూ.7913, నోయిడాలో రూ.7913గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7240గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7898 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7240గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7898 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.2000 పెరిగి నేడు రూ.1,05,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు మరియు మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..



Click it and Unblock the Notifications