Gold Price Today: రోజులు గడుస్తున్న కొద్ది బంగారం ధరలు ఏకంగా కొండెక్కి కూర్చుంటున్నాయి. నెలల గరిష్ఠాలకు చేరి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. పసిడి ప్రియులైన భారతీయులు ఆభరణాల కొనుగోలు ప్రస్తుతానికి రేట్ల పెరుగుదల చూసి వాయిదా వేసుకుంటున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.61,500, ముంబైలో రూ.60,750, దిల్లీలో రూ.60,900, కలకత్తాలో రూ.60,750, బెంగళూరులో రూ.60,750, కేరళలో రూ.60,750, జైపూరులో రూ.60,900, లక్నోలో రూ.60,900, మంగళూరులో రూ.60,750, నాశిక్ లో రూ.60,780, అయోధ్యలో రూ.60,900, నాశిక్ లో రూ.60,780గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.540 పెరిగి షాక్ ఇచ్చింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.67,100, ముంబైలో రూ.66,270, దిల్లీలో రూ.66,420, కలకత్తాలో రూ.66,270, బెంగళూరులో రూ.66,270, కేరళలో రూ.66,270, జైపూరులో రూ.66,420, లక్నోలో రూ.66,420, మంగళూరులో రూ.66,270, అయోధ్యలో రూ.66,420, నాశిక్ లో రూ.66,270గా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కాకినాడ, విశాఖ, కడప, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్లో గోల్డ్ నేటి రిటైల్ విక్రయ ధర రూ.60,750గా ఉండగా.. 24 క్యారెట్లో గోల్డ్ రేటు రూ.66,270 వద్ద కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలోని వివిధ నగరాల్లో నేటి వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.200 పెరిగి రిటైల్ మార్కెట్లో రూ.79,100 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications