Gold Price Today: గడచిన వారం రోజుల సమయంలో దాదాపు రెండు సార్లు భారీగా తగ్గిన పసిడి ధరలు మళ్లీ తమ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ట్రంప్ భారతదేశపు పన్నులపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత ఎక్కువ పన్నులు ఇండియా విధిస్తోందని మెుదటి టర్మ్ లో చెప్పిన ట్రంప్ ఇకపై తాము కూడా అదే విధంగా పన్నులు విధించనున్నట్లు ప్రపంచ దేశాలకు స్పష్టం చేశారు.
ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందస్తు వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరగటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా-యూఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణాలతో గోల్డ్ రేట్లు సామాన్యులకు అందనంత స్థాయిలకు పెరిగిపోయాయి.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5,000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7940, ముంబైలో రూ.7940, దిల్లీలో రూ.7955, కలకత్తాలో రూ.7940, బెంగళూరులో రూ.7940, కేరళలో రూ.7940, పూణేలో రూ.7940, వడోదరలో రూ.7945, జైపూరులో రూ.7904, లక్నోలో రూ.7904, మంగళూరులో రూ.7940, నాశిక్ లో రూ.7943, అయోధ్యలో రూ.7955, బళ్లారిలో రూ.7940, గురుగ్రాములో రూ.7955, నోయిడాలో రూ.7955గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.5,500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.8662, ముంబైలో రూ.8662, దిల్లీలో రూ.8677, కలకత్తాలో రూ.8662, బెంగళూరులో రూ.8662, కేరళలో రూ.8662, పూణేలో రూ.8662, వడోదరలో రూ.8667, జైపూరులో రూ.8621, లక్నోలో రూ.8621, మంగళూరులో రూ.8662, నాశిక్ లో రూ.8665, అయోధ్యలో రూ.8677, బళ్లారిలో రూ.8662, గురుగ్రాములో రూ.8677, నోయిడాలో రూ.8677గా ఉన్నాయి.
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7889గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8606 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7889గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8606 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,08,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications