Gold Rate: మంచి రోజులు మించిపోతున్నాయ్.. పసిడి ప్రియులారా త్వరపడండి..
Gold Rate: గడచిన రెండు రోజులుగా బంగారం రిటైల్ విక్రయ ధరలు దేశంలో స్థిరంగా కొనసాగాయి. అయితే గ్లోబల్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో గోల్డ్ మళ్లీ పరుగు మెుదలెట్టింది.
దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.120 చొప్పున పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో బంగారం రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. ముంబైలో రూ.55,100, చెన్నైలో రూ.55,500, దిల్లీలో రూ.55,130, కలకత్తాలో రూ.55,100, బెంగళూరులో రూ.55,100, కేరళలో రూ.55,100, పూణేలో రూ.55,130, వడోదరలో రూ.55,030, నాగపూర్ లో రూ.55,100, సూరత్ లో రూ.55,030, మంగళూరులో రూ.55,100, గురుగ్రామ్ లో రూ.55,130, సేలమ్ లో రూ.55,500 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఇదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు రూ.120 మేర పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. ముంబైలో రూ.60,100, చెన్నైలో రూ.60,550, దిల్లీలో రూ.60,130, కలకత్తాలో రూ.60,100, బెంగళూరులో రూ.60,100, కేరళలో రూ.60,100, పూణేలో రూ.60,100, వడోదరలో రూ.60,030, నాగపూర్ లో రూ.60,100, సూరత్ లో రూ.60,030, మంగళూరులో రూ.60,100, గురుగ్రామ్ లో రూ.60,130, సేలమ్ లో రూ.60,500 వద్ద ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి తాజా ధరలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, అనంతపురంలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,100 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.60,100గా కొనసాగుతోంది. తెలంగాణలోని నగరాల్లో సైతం ఇవే రిటైల్ ధరలకు గోల్డ్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధరలను పరిశీలిస్తే.. నేడు కిలోకు రూ.300 మేర పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.81,400కు విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications