Gold Rate Today: పసిడి ప్రియులకు హైఓల్టేజ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. తాజా ధరలు
Gold Rate Today: పసిడి ప్రియుల సంతోషం మూడునాళ్ల ముచ్చటగా మారిపోయింది. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి. ఈరోజు మళ్లీ పరుగు మెుదలు పెట్టడంతో పండుగ వేళ కొనుగోలు దారుల్లో సంతోషం ఆవిరైపోయింది.
22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.500 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,650, ముంబైలో రూ.55,450, దిల్లీలో రూ.55,600, కలకత్తాలో రూ.55,450, బెంగళూరులో రూ.55,450, కేరళలో రూ.55,450, వడోదరలో రూ.55,500, పూణేలో రూ.55,450, లక్నోలో రూ.55,600, జైపూర్ లో రూ.55,600, సూరత్ లో రూ.55,500, మంగళూరులో రూ.55,450, నాశిక్ లో రూ.55,480, బళ్లారిలో రూ.55,450, నోయిడాలో రూ.55,600 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు రూ.540 పెరిగింది. దీంతో ముఖ్యమైన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,710, ముంబైలో రూ.60,490, దిల్లీలో రూ.60,640, కలకత్తాలో రూ.60,490, బెంగళూరులో రూ.60,490, కేరళలో రూ.60,490, వడోదరలో రూ.60,540, పూణేలో రూ.60,490, లక్నోలో రూ.60,640, జైపూర్ లో రూ.60,640, సూరత్ లో రూ.60,540, మంగళూరులో రూ.60,490, నాశిక్ లో రూ.60,520, బళ్లారిలో రూ.60,490, నోయిడాలో రూ.60,640 వద్ద కొనసాగుతున్నాయి.
ఏపీ, తెలంగాణలోని విజయవాడ, గుంటూరు, కాకినాడ, కడప, అనంతపురం, నెల్లూరు, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో నేటి రిటైల్ ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,450గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.60,490 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి నేడు రూ.1000 పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ధర రూ.78,000గా ఉంది.


Click it and Unblock the Notifications