Gold Rate: గుప్పతిప్పుకోనివ్వని గోల్డ్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం పెరిగిన ధరలివే..
Gold Price Today: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లపై ఈవారం కీలక ప్రకటన చేయనున్న వేళ బంగారం రేట్ల పరుగులు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. వరుసగా గత మూడు రోజులుగా గోల్డ్ తన పెరుగుదలను కొనసాగిస్తూ సామాన్యులకు అందనంత దూరానికి చేరుకుంది. నవరాత్రులు దగ్గరపడుతున్న వేళ రిటైల్ గోల్డ్ రేట్లు కొనుగోలుదారుల మతి పోగొడుతోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు 100 గ్రాములకు రూ.1500 మేర పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6880, ముంబైలో రూ.6880, దిల్లీలో రూ.6895, కలకత్తాలో రూ.6880, బెంగళూరులో రూ.6880, కేరళలో రూ.6880, వడోదరలో రూ.6885, అయోధ్యలో రూ.6885, మంగళూరులో రూ.6880, బళ్లారిలో రూ.6880, నోయిడాలో రూ.6885, గురుగ్రాములో రూ.6885 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.1600 పెరిగింది. దీంతో వరుసగా మూడోరోజు దేశంలో గోల్డ్ రేట్ల పెరుగుతలో వివిధ ప్రాంతాల్లో పెరిగిన పసిడి ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7505, ముంబైలో రూ.7505, దిల్లీలో రూ.7515, కలకత్తాలో రూ.7505, బెంగళూరులో రూ.7505, కేరళలో రూ.7505, వడోదరలో రూ.7505, అయోధ్యలో రూ.7505, మంగళూరులో రూ.7505, బళ్లారిలో రూ.7505, నోయిడాలో రూ.7505, గురుగ్రాములో రూ.7505 వద్ద ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6880గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7505 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 పెరుగుదలతో రూ.98,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications