Gold Rate Today: రోజులు గడుస్తున్న కొద్ది బంగారం ధరలు ర్యాలీని కొనసాగిస్తూనే ఉన్నాయి. వరుస పండుగలు క్యూ కడుతున్న వేళ క్రమంగా గోల్డ్ సామాన్యులు కొనలేని స్థాయిల వైపు పయనిస్తోంది. అంతర్జాతీయ ఒడిదొడుకులు సైతం దీనికి ఆజ్యం పోస్తున్నాయి.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.150 పెరిగింది. దీంతో నేటి రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.55,500, ముంబైలో రూ.55,200, దిల్లీలో రూ.55,350, కలకత్తాలో రూ.55,200, కేరళలో రూ.55,200, వడోదరలో రూ.55,250, జైపూర్ లో రూ.55,350, కోయంబత్తూరులో రూ.55,500, సూరత్ లో రూ.55,250, మంగళూరులో రూ.55,200, నాశిక్ లో రూ.55,230, గురుగ్రామ్ లో రూ.55,350 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 24 క్యారెట్ల పసిడి ధరలను పరిశీలిస్తే నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.170 మేర పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,550, ముంబైలో రూ.60,220, దిల్లీలో రూ.60,370, కలకత్తాలో రూ.60,220, కేరళలో రూ.60,220, వడోదరలో రూ.60,270, జైపూర్ లో రూ.60,370, కోయంబత్తూరులో రూ.60,550, సూరత్ లో రూ.60,270, మంగళూరులో రూ.60,220, నాశిక్ లో రూ.60,250, గురుగ్రామ్ లో రూ.60,370గా ఉన్నాయి.
ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, కడప, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, విశాఖ, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.55,200గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,220 వద్ద రిటైల్ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో వెండి ధరలను పరిశీలిస్తే.. నేడు కేజీకి రూ.300 పెరగటంతో రూ.78,300 వద్దకు చేరుకుంది.


Click it and Unblock the Notifications