Gold Price Today: దేశీయంగా తగ్గుతున్న బంగారం ధరలు అనేక మందికి ఊరటను కలిగిస్తున్నాయి. ఇటీవల పెళ్లిళ్ల సీజన్ కావటంతో పెరిగిన గోల్డ్ రేట్లు చల్లారటం చాలా మంది కొత్త కొనుగోళ్లు చేసేందుకు వెసులుబాటు కల్పిస్తోంది.
ఈ క్రమంలో నేడు 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.100 మేర తగ్గింది. దీంతో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చైన్నైలో రూ.58,000, ముంబైలో రూ.57,500, దిల్లీలో రూ.57,650, కోలకత్తాలో రూ.57,500, బెంగళూరులో రూ.57,500, కేరళలో రూ.57,500, వడోదరలో రూ.57,550, నాశిక్‌లో రూ.57,530, మంగళూరులో రూ.57,500, అయోధ్యలో రూ.57,650, బళ్లారిలో రూ.57,500, గురుగ్రామ్‌లో రూ.57,650గా కొనసాగుతున్నాయి.

అలాగే 24 క్యారెట్లు గోల్డ్ ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.110 తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చైన్నైలో రూ.63,230, ముంబైలో రూ.62,730, దిల్లీలో రూ.62,880, కోలకత్తాలో రూ.62,730, బెంగళూరులో రూ.62,730, కేరళలో రూ.62,730, వడోదరలో రూ.57,550, నాశిక్‌లో రూ.62,760, మంగళూరులో రూ.62,730, అయోధ్యలో రూ.62,880, బళ్లారిలో రూ.62,730, గురుగ్రామ్‌లో రూ.62,880గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, కాకినాడ, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల రేటు రూ.57,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,730 వద్ద కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వెండి తాజా ధరలను పరిశీలిస్తే.. కేజీ రేటు రూ.700 తగ్గి రిటైల్ ధర నేడు రూ.76,500గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications