Gold Rate: 2వ రోజూ పాతాళానికి పసిడి రేటు.. నేడు రూ.13,100 తగ్గిన గోల్డ్ ధర, కొనుక్కోండి..!!
Gold Price Today: నవంబర్ చివరి వారంలో పసిడి ప్రియులకు మంచి రోజులు తిరిగి వచ్చాయి. గతవారం నిరంతరాయంగా బ్రేక్ లేకుండా పెరిగిన పసిడి ధరలు సామాన్యులకు దడ పుట్టించాయి. పెళ్లిళ్లతో పాటు అనేక ఇతర శుభకార్యాలకు అవసరమైన కొనుగోళ్లు చేపడుతున్న చాలా మందికి ప్రస్తుతం తగ్గుతున్న ధరలు జోష్ నింపుతున్నాయి. అయితే షాపింగ్ కి వెళ్లటానికి ముందుగా నేటి రిటైల్ విక్రయ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడాల్సిందే.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు ఏకంగా రూ.12,000 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7080, ముంబైలో రూ.7080, దిల్లీలో రూ.7095, కలకత్తాలో రూ.7080, బెంగళూరులో రూ.7080, కేరళలో రూ.7080, పూణేలో రూ.7080, వడోదరలో రూ.7085, అహ్మదాబాదులో రూ.7085, జేపూరులో రూ.7095, లక్నోలో రూ.7095, కోయంబత్తూరులో రూ.7080, మంగళూరులో రూ.7080, నాశిక్ లో రూ.7083, మైసూరులో రూ.7080, అయోధ్యలో రూ.7095, బళ్లారిలో రూ.7080, నోయిడాలో రూ.7095, గురుగ్రాములో రూ.7095 వద్ద నేడు విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.13,100 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7724, ముంబైలో రూ.7724, దిల్లీలో రూ.7739, కలకత్తాలో రూ.7724, బెంగళూరులో రూ.7724, కేరళలో రూ.7724, పూణేలో రూ.7724, వడోదరలో రూ.7729, అహ్మదాబాదులో రూ.7729, జేపూరులో రూ.7739, లక్నోలో రూ.7739, కోయంబత్తూరులో రూ.7724, మంగళూరులో రూ.7724, నాశిక్ లో రూ.7727, మైసూరులో రూ.7724, అయోధ్యలో రూ.7739, బళ్లారిలో రూ.7724, నోయిడాలో రూ.7739, గురుగ్రాములో రూ.7739గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7080గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7724 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7080గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7724 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2000 తగ్గి రూ.98,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications