Gold Rate: శుభవార్త.. పాతాళానికి పడిన గోల్డ్ రేటు.. నేడు రూ.6000 తగ్గిన ధర, తాజా రేట్లివే
Gold Price Today: పసిడి ప్రియులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోజులు తిరిగి వచ్చాయి. దీపావళితి సరిగ్గా వారం రోజులే ఉండటంతో రేట్ల తగ్గింపు కోసం చాలా మంది ఆసక్తిగా మార్కెట్లో ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ధనత్రయోదశికి షాపింగ్ చేయాలనుకుంటున్న వారిలో సైతం కొత్త జోష్ మెుదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేడు పసిడి షాపింగ్ కోసం వెళ్లటం ఉత్తమమని చాలా మంది భావిస్తున్నారు. అయితే దీనికి ముందు తాజాగా తగ్గిన ధరలను అందరూ పరిశీలించాల్సి ఉంటుంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.5500 తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7285, ముంబైలో రూ.7285, దిల్లీలో రూ.7300, కలకత్తాలో రూ.7285, బెంగళూరులో రూ.7285, కేరళలో రూ.7285, వడోదరలో రూ.7290, జైపూరులో రూ.7300, లక్నోలో రూ.7300, పాట్నాలో రూ.7290, మంగళూరులో రూ.7285, నాశిక్ లో రూ.7288, అయోధ్యలో రూ.7300, బళ్లారిలో రూ.7285, నోయిడాలో రూ.7300, గురుగ్రాములో రూ.7300 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.6000 తగ్గింపును నేడు నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన తాజా ధరలను పరిగణిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7947, ముంబైలో రూ.7947, దిల్లీలో రూ.7962, కలకత్తాలో రూ.7947, బెంగళూరులో రూ.7947, కేరళలో రూ.7947, వడోదరలో రూ.7952, జైపూరులో రూ.7962, లక్నోలో రూ.7962, పాట్నాలో రూ.7952, మంగళూరులో రూ.7947, నాశిక్ లో రూ.7950, అయోధ్యలో రూ.7962, బళ్లారిలో రూ.7947, నోయిడాలో రూ.7962, గురుగ్రాములో రూ.7962గా ఉన్నాయి. అయితే ఇవి చట్టపరమైన పన్నులు, వ్యాపారి లాభాలు, తరుగు మజూరి వంటి ఖర్చులను జోడించక మునుపటి ధరలుగా గుర్తుంచుకోండి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7285గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7947 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7285గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7947 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.2000 తగ్గి నేడు రూ.1,10,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications