Gold Rate: కుప్పకూలిన గోల్డ్.. నేడు రూ.14,700 క్షీణించిన పసిడి ధర, ప్లీజ్ షాపింగ్ లేట్ చేయెుద్దు!
Gold Price Today: అమెరికాలో ట్రంప్ విజయంతో భారతీయుల కల నెలవేరుతోంది. రోజురోజుకూ ధరలు తగ్గుతూ సామాన్యులకు అందుబాటు రేట్లకు వస్తున్నాయి. ఇన్నాళ్లుగా గోల్డ్ కొనాలని డబ్బు పోగేసుకున్న చాలా మంది ప్రస్తుత ధరల పతనంలో షాపింగ్ చేసేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఏపీ తెలంగాణలో తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ రేట్లను తప్పక పరిశీలించాలి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.13,350 తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7085, ముంబైలో రూ.7085, దిల్లీలో రూ.7100, కలకత్తాలో రూ.7085, బెంగళూరులో రూ.7085, కేరళలో రూ.7085, పూణేలో రూ.7085, వడోదరలో రూ.7090, అహ్మదాబాదులో రూ.7090, జైపూరులో రూ.7100, లక్నోలో రూ.7100, పాట్నాలో రూ.7090, మంగళూరులో రూ.7085, నాశిక్ లో రూ.7088, మైసూరులో రూ.7085, అయోధ్యలో రూ.7100, బళ్లారిలో రూ.7085, గురుగ్రాములో రూ.7100, నోయిడాలో రూ.7100గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర 100 గ్రాములకు రూ.14,700 తగ్గుదలను చూసింది. నేడు గోల్డ్ భారీ తగ్గింపుతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7729, ముంబైలో రూ.7729, దిల్లీలో రూ.7744, కలకత్తాలో రూ.7729, బెంగళూరులో రూ.7729, కేరళలో రూ.7729, పూణేలో రూ.7729, వడోదరలో రూ.7734, అహ్మదాబాదులో రూ.7090, జైపూరులో రూ.7744, లక్నోలో రూ.7744, పాట్నాలో రూ.7734, మంగళూరులో రూ.7729, నాశిక్ లో రూ.7732, మైసూరులో రూ.7729, అయోధ్యలో రూ.7744, బళ్లారిలో రూ.7729, గురుగ్రాములో రూ.7744, నోయిడాలో రూ.7744 వద్ద విక్రయించబడుతున్నాయి. పైన పేర్కొన్న రేట్లకు అదనంగా తరుగు, మజూరి, జీఎస్టీ వంటి చార్జీలు ఉంటాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7085గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7729 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7085గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7729 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2000 తగ్గి రూ.1,00,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది. పైన పేర్కొన్న ధరలకు జీఎస్టీ, తరుగు, వ్యాపారి లాభాలు, మజూరి వంటివి కలపకముందు రేట్లుగా గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications