Gold Price Today: సామాన్యుల ఇంటికి కనకం.. పండగ తర్వాత పడిపోయిన పసిడి ధరలు..
Gold Rate Today: పండుగ హడావిడి తగ్గటంతో బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. నిన్నటి వరకు డిమాండ్ కారణంగా అధికంగా కొనసాగిన గోల్డ్ రేటు తాజాగా తగ్గటంతో చాలా మంది ఆభరణాల షాపింగ్ మెుదలెడుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.350 క్షీణించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,100, ముంబైలో రూ.57,700, దిల్లీలో రూ.57,850, కర్నాటకలో రూ.57,700, కేరళలో రూ.57,700, పూణేలో రూ.57,700, వడోదరలో రూ.57,750, జైపూరులో రూ.57,850, కోయంబత్తూరులో రూ.58,100, పాట్నాలో రూ.57,750, నాశిక్ లో రూ.57,730, సేలంలో రూ.58,100, మైసూరులో రూ.57,700, అయోధ్యలో రూ.57,850, బళ్లారిలో రూ.57,700గా కొనసాగుతోంది.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలను తగ్గిన తర్వాత పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,380, ముంబైలో రూ.62,950, దిల్లీలో రూ.63,100, కర్నాటకలో రూ.62,950, కేరళలో రూ.62,950, పూణేలో రూ.62,950, వడోదరలో రూ.63,000, జైపూరులో రూ.63,100, కోయంబత్తూరులో రూ.63,380, పాట్నాలో రూ.63,000, నాశిక్ లో రూ.62,980, సేలంలో రూ.63,380, మైసూరులో రూ.62,950, అయోధ్యలో రూ.63,100, బళ్లారిలో రూ.62,950గా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అమరావతి, అనంతపురం, కడప, కర్నూలు, విశాఖ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,700గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.62,950గా కొనసాగుతోంది. ఇదే సమయంలో వెండి ధరలను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.600 తగ్గి రిటైల్ మార్కెట్లో రూ.77,400గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications