Gold Rate: దీపావళి తర్వాత కుప్పకూలిన గోల్డ్ ధర.. నేడు రూ.7700 తగ్గిన పసిడి, లేటు చేయెుద్దు..
Gold Price Today: రెండు వారాలుగా గోల్డ్, సిల్వర్ రేట్లు దేశంలో విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. దీపావళితో పాటు పెళ్లిళ్ల సీజన్, కార్తీకమాసం వంటి పండుగల సమయంలో కొనుగోలుదారులకు నిరంతరాయంగా పెరిగిన గోల్డ్ ధరల నుంచి నేడు భారీ ఊరట లభించింది. దీపావళి తర్వాత రోజున గోల్డ్ ధరలు పాతాళానికి పడిపోవటంతో వేచి చూద్దాం అనుకున్న చాలా మంది పసిడి ప్రియులు నేడు తమ ఆభరణాల షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.7000 తగ్గింపును నేడు నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7385, ముంబైలో రూ.7385, దిల్లీలో రూ.7400, కలకత్తాలో రూ.7385, బెంగళూరులో రూ.7385, కేరళలో రూ.7385, వడోదరలో రూ.7390, జైపూరులో రూ.7400, లక్నోలో రూ.7400, మధురైలో రూ.7385, మంగళూరులో రూ.7385, నాశిక్ లో రూ.7388, అయోధ్యలో రూ.7400, బళ్లారిలో రూ.7385, గురుగ్రాములో రూ.7400, నోయిడాలో రూ.7400గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.7700 తగ్గుదలను చూసింది. దీంతే దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన నేటి రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8056, ముంబైలో రూ.8056, దిల్లీలో రూ.8071, కలకత్తాలో రూ.8056, బెంగళూరులో రూ.8056, కేరళలో రూ.8056, వడోదరలో రూ.8061, జైపూరులో రూ.8071, లక్నోలో రూ.8071, మధురైలో రూ.8056, మంగళూరులో రూ.8056, నాశిక్ లో రూ.8059, అయోధ్యలో రూ.8071, బళ్లారిలో రూ.8056, గురుగ్రాములో రూ.8071, నోయిడాలో రూ.8071 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7385గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8056 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7385గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8056 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.3000 తగ్గి నేడు రూ.1,06,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications