Gold Price Today: అక్షయతృతీయ రోజున అనూహ్యంగా పెరిగిన పసిడి ధరలు నేడు భారీగా క్షీణించాయి. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగింది చారెడు తగ్గింది మూరడు అన్నట్లుగా ఉంది. అయినప్పటికీ చాలా మంది వారాంతంలో షాపింగ్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఒక్కరోజు ఆగిన వారు నేడు తగ్గిన రేట్లకు కొనేందుకు సిద్ధంగా ఉండగా నేటి రేట్లను తప్పక పరిశీలించాల్సిందే.
22 క్యారెట్ల పసిడి ధరలు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.3,000 క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.67,500, ముంబైలో రూ.67,250, దిల్లీలో రూ.67,400, కలకత్తాలో రూ.67,250, బెంగళూరులో రూ.67,250, కేరళలో రూ.67,250, వడోదరలో రూ.67,300, జైపూరులో రూ.67,400, మంగళూరులో రూ.67,250, నాశిక్ లో రూ.67,280, అయోధ్యలో రూ.67,400, బళ్లారిలో రూ.67,250, గురుగ్రాములో రూ.67,400, నోయిడాలో రూ.67,400 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటి కంటే నేడు రూ.3,300 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.73,640, ముంబైలో రూ.73,360, దిల్లీలో రూ.73,510, కలకత్తాలో రూ.73,360, బెంగళూరులో రూ.73,360, కేరళలో రూ.73,360, వడోదరలో రూ.73,410, జైపూరులో రూ.73,510, మంగళూరులో రూ.73,360, నాశిక్ లో రూ.73,390, అయోధ్యలో రూ.73,510, బళ్లారిలో రూ.73,360, గురుగ్రాములో రూ.73,510, నోయిడాలో రూ.73,510గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.67,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,360 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.700 తగ్గి రూ.90,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications