Gold: అబ్బా తగ్గిన బంగారం రేటు.. కార్తీకమాసం చివర్లో శుభవార్త.. కొనేయండి..
Gold Rate Today: మారుతున్న అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత నెలలో భారీ పెరుగుదలల తర్వాత గోల్డ్ మళ్లీ సామాన్యులకు తిరిగి అందుబాటు ధరల్లోకి వస్తున్నాయి.
22 క్యారెట్ల బంగారం ధరలు నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.200 క్షీణించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,500, ముంబైలో రూ.56,950, దిల్లీలో రూ.57,050, కలకత్తాలో రూ.56,950, కేరళలో రూ.56,950, పూణేలో రూ.56,950, అహ్మదాబాదులో రూ.57,000, జైపూరులో రూ.57,050, కోయంబత్తూరులో రూ.57,500, మంగళూరులో రూ.56,950, నాశిక్‌లో రూ.56,980, మైసూరులో రూ.56,950, బళ్లారిలో రూ.56,950, గురుగ్రామ్‌లో రూ.57,050 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.220 క్షీణతను నమోదు చేసింది. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.62,730, ముంబైలో రూ.62,130, దిల్లీలో రూ.61,230, కలకత్తాలో రూ.62,130, కేరళలో రూ.62,130, పూణేలో రూ.62,130, అహ్మదాబాదులో రూ.61,180, జైపూరులో రూ.61,230, కోయంబత్తూరులో రూ.62,730, మంగళూరులో రూ.62,130, నాశిక్‌లో రూ.62,160, మైసూరులో రూ.62,130, బళ్లారిలో రూ.62,130, గురుగ్రామ్‌లో రూ.61,230 వద్ద ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనంతపురం, విశాఖ, కడప, కర్నూలు, గుంటూరు, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ తగ్గిన ధర రూ.56,590గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేటు రూ.62,130గా కొనసాగుతోంది. ఇక ఏపీ, తెలంగాణలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.200 తగ్గటంతో నేడు రిటైల్ మార్కెట్లో రూ.77,800 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications