Gold Price Today: అక్షయతృతీయ రోజున భారీగా పెరిగిన పసిడి ధరలు ప్రస్తుతం చల్లారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక కోలాహలం కొనసాగుతున్న వేళ అందరి చేతుల్లో డబ్బులు గలగల్లాడుతున్నాయి. నేడు పసిడి ధరలు తగ్గటంతో చాలా మంది బంగారు ఆభరణాల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు.
వారం ప్రారంభంలో 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు ధర స్వల్పంగా రూ.1,000 తగ్గింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.67,250, ముంబైలో రూ.67,150, దిల్లీలో రూ.67,300, కలకత్తాలో రూ.67,150, బెంగళూరులో రూ.67,150, కేరళలో రూ.67,150, వడోదరలో రూ.67,200, జైపూరులో రూ.67,300, మంగళూరులో రూ.67,150, నాశిక్ లో రూ.67,180, అయోధ్యలో రూ.67,300, బళ్లారిలో రూ.67,150, గురుగ్రాములో రూ.67,300, నోయిడాలో రూ.67,300గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు రేటు నిన్నటితో పోల్చితే రూ.1,100 తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.73,360, ముంబైలో రూ.73,250, దిల్లీలో రూ.73,380, కలకత్తాలో రూ.73,250, బెంగళూరులో రూ.73,250, కేరళలో రూ.73,250, వడోదరలో రూ.73,280, జైపూరులో రూ.73,380, మంగళూరులో రూ.73,250, నాశిక్ లో రూ.73,280, అయోధ్యలో రూ.73,380, బళ్లారిలో రూ.73,250, గురుగ్రాములో రూ.73,380, నోయిడాలో రూ.73,380గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.67,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,250 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 తగ్గి రూ.90,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications