Gold Rate Today: దేశంలో వరుసగా రెండోసారి బంగారం ధరలు కుప్పకూలాయి. రెండు వారాల్లో దీపావళి దగ్గర పడుతున్న వేళ పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. దీంతో భారతీయ కస్టమర్లు గోల్డ్ షాపింగ్ మెుదలుపెట్టారు.
నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 తగ్గిన తర్వాత నేడు ఏకంగా రూ.500 పడిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే చెన్నైలో రూ.57,150, ముంబైలో రూ.56,700, దిల్లీలో రూ.56,850, కలకత్తాలో రూ.56,700, బెంగళూరులో రూ.56,700, కేరళలో రూ.56,700, వడోదరలో రూ.56,750, జైపూర్‌లో రూ.56,850, మధురైలో రూ.57,150, నాశిక్ లో రూ.56,730, మైసూరులో రూ.56,700, బళ్లారిలో రూ.56,700, గురుగ్రామ్‌లో రూ.56,850 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు నిన్న రూ.230 తగ్గగా నేడు రూ.550 క్షీణించింది. ఇక దేశంలోని ముఖ్యమైన నగరాల్లో తాజా రిటైల్ విక్రయ ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.62,350, ముంబైలో రూ.61,850, దిల్లీలో రూ.62,000, కలకత్తాలో రూ.61,850, బెంగళూరులో రూ.61,850, కేరళలో రూ.61,850, వడోదరలో రూ.61,900, జైపూర్‌లో రూ.62,000, మధురైలో రూ.62,350, నాశిక్ లో రూ.61,880, మైసూరులో రూ.61,850, బళ్లారిలో రూ.61,850, గురుగ్రామ్‌లో రూ.62,000 గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోని ముఖ్యమైన నగరాలు విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కాకినాడ, విశాఖ, కడప, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,700గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,850 వద్ద కొనసాగున్నాయి. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.300 తగ్గి తెలుగు రాష్ట్రాల్లో కేజీ ధర రూ.78,200గా రిటైల్ మార్కెట్లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications