Gold Rates: అక్షయ తృతీయకు ఇంకా నాలుగు రోజులే ఉంది. ఈ క్రమంలో బంగారం ధరలు కొంత కాలంగా పెరుగుతున్నాయి. అయితే ఈరోజు మాత్రం గోల్డ్ ధర తగ్గింది. బంగారం కొనాలనుకుంటున్న చాలా మందికి ఇది పెద్ద శుభవార్త.
దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధరలు చెన్నైలో రూ.56,450, ముంబైలో రూ.55,850, దిల్లీలో రూ.56,000, కోల్‌కత్తాలో రూ.55,850, బెంగళూరులో రూ.55,900, కేరళలో రూ.55,850, పూణేలో రూ.55,850, వడోదరా రూ.55,900, కోయంబత్తూర్ రూ.56,450, మైసూర్ రూ.55,900, వెల్లూర్ లో రూ.56,450గా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు దాదాపు రూ.90 బంగారం విక్రయ ధరలు తగ్గాయి.

ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరల వివరాలను పరిశీలిస్తే.. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల ధరలు చెన్నైలో రూ.61,600, ముంబైలో రూ.60,920, దిల్లీలో రూ.61,070, కోల్‌కత్తాలో రూ.60,920, బెంగళూరులో రూ.60,970, కేరళలో రూ.60,920, పూణేలో రూ.60,920, వడోదరా రూ.60,970, కోయంబత్తూర్ రూ.60,600, మైసూర్ రూ.60,970, వెల్లూర్ లో రూ.61,600గా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు దాదాపు రూ.110 పసిడి ధరలు తగ్గాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో స్వచ్ఠమైన 24 క్యారెట్ల గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. హైదరాబాదులో రూ.60,920గా ఉండగా.. విజయవాడలో రూ.90,920గా ఉన్నాయి. ఏపీలోని విశాఖ, అమరావతి, నెల్లూరు, కాకినాడ, కడప, తిరుపతి, అనంతపురం నగరాల్లో ధర రూ.60,920 వద్ద కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల్లో సైతం ధర రూ.60,920గా ఉంది.
ఈ రోజు వెండి ధరలను పరిశీలిస్తే.. కిలో వెండి ధర నేడు రూ.77,400గా ఉంది. నిన్నటితో పోల్చితే వెండి ధర కిలోకు దాదాపు రూ.1,100 మేర తగ్గింది. ఏప్రిల్ 17న కిలో వెండి ధర రూ.75,500గా ఉంది.


Click it and Unblock the Notifications