Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిణామాలు బంగారం ధరల్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్ల కొనసాగింపుతో నేడు పసిడి ధర కిందకు దిగివచ్చింది. నిన్నటి భారీ పెరుగుదల తర్వాత రేట్ల క్షీణత పెద్ద ఉపశమనంగా భారతీయ పసిడి ప్రియులు భావిస్తున్నారు.
22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి భారీ పెరుగుదల తర్వాత నేడు దిగివచ్చింది. 100 గ్రాములకు రేటు రూ.4,500 తగ్గటం స్వల్ప ఊరటగా చెప్పుకోవాలి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో కొనుగోలుకు తాజాగా తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.62,000, ముంబైలో రూ.61,350, దిల్లీలో రూ.61,500, కలకత్తాలో రూ.61,350, బెంగళూరులో రూ.61,350, కేరళలో రూ.61,350, వడోదరలో రూ.61,400, జైపూరులో రూ.61,500, లక్నోలో రూ.61,500, నాశిక్ లో రూ.61,380, అయోధ్యలో రూ.61,500, బళ్లారిలో రూ.61,350, గురుగ్రాములో రూ.61,500, నోయిడాలో రూ.61,500 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.4,900 క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశంలోని ముఖ్యమైన నగరాల్లో తగ్గిన రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.67,640, ముంబైలో రూ.66,930, దిల్లీలో రూ.67,080, కలకత్తాలో రూ.66,930, బెంగళూరులో రూ.66,930, కేరళలో రూ.66,930, వడోదరలో రూ.66,980, జైపూరులో రూ.67,080, లక్నోలో రూ.67,080, నాశిక్ లో రూ.66,960, అయోధ్యలో రూ.67,080, బళ్లారిలో రూ.66,930, గురుగ్రాములో రూ.67,080, నోయిడాలో రూ.67,080 వద్ద కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.61,350గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,930 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.2,000 తగ్గి రూ.79,500 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications