Gold Price Today: రెండు వారాలుగా నిద్రలేకుండా చేస్తున్న పసిడి ధరలు నేడు భారీ పతనాన్ని చూశాయి. వాస్తవానికి దసరా, దీపావళికి గోల్డ్ కొనుగోలు చేద్దామని ప్లాన్ చేసిన చాలా మంది ఇటీవలి భారీ ర్యాలీతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న స్థిరంగా కొనసాగిన తర్వాత నేడు గ్లోబల్ కారణాలతో పసిడి ధరలు చల్లారాయి. దీంతో చాలా మంది పసిడి ఆభరణాల షాపింగ్ కోసం క్యూ కడుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.7000 భారీ తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7030, ముంబైలో రూ.7030, దిల్లీలో రూ.7045, కలకత్తాలో రూ.7030, బెంగళూరులో రూ.7030, కేరళలో రూ.7030, వడోదరలో రూ.7035, జైపూరులో రూ.7045, లక్నోలో రూ.7045, పూణేలో రూ.7030, మంగళూరులో రూ.7030, నాశిక్ లో రూ.7033, అయోధ్యలో రూ.7045, బళ్లారిలో రూ.7030, నోయిడాలో రూ.7045 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర 100 గ్రాములకు ఏకంగా రూ.7600 తగ్గి నేడు కొనుగోలుదారుల్లో కొత్త హుషారు నింపింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7669, ముంబైలో రూ.7669, దిల్లీలో రూ.7684, కలకత్తాలో రూ.7669, బెంగళూరులో రూ.7669, కేరళలో రూ.7669, వడోదరలో రూ.7674, జైపూరులో రూ.7684, లక్నోలో రూ.7684, పూణేలో రూ.7669, మంగళూరులో రూ.7669, నాశిక్ లో రూ.7672, అయోధ్యలో రూ.7684, బళ్లారిలో రూ.7669, నోయిడాలో రూ.7684గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7030గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7669 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2,000 తగ్గుదలతో రూ.1,00,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
వాస్తవానికి మూడు నెలల కాలంలో 12 శాతం పెరుగుదల అంటే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదం కమోడిటీ మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా అనేక విలువైన లోహాల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ప్రస్తుతం గ్లోబల్ సంక్షోభ సమయంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తూ.. పెద్ద సంస్థలు సెంట్రల్ బ్యాంకులు అధిక స్థాయిల్లో గోల్డ్ నిల్వలు పెంచుకుంటున్నాయి. ఇది పరోక్షంగా రిటైల్ మార్కెట్లలో గోల్డ్ రేట్లను వేగంగా పెంచటం మనం గమనించవచ్చు. అయితే ప్రస్తుతం పరిస్థితు నెమ్మదిస్తున్న వేళ ఒకపక్క క్రూడ్ ఆయిల్ ధరలు పతనం కాగా మరోపక్క బంగారం, వెండి ధరలు సైతం భారీ ర్యాలీ తర్వాత క్షీణతను చూస్తున్నాయి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications