Gold Rate: రూ.లక్ష దిశగా దూసుకుపోతున్న గోల్డ్ రేటు.. నేడు రూ.4,300 అప్, దేవుడే ఆపాలిక..
Gold Price Today: ప్రస్తుతం వరుసగా కొనసాగుతున్న పండుగల సీజన్ తో పాటు మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వంటి కారణాలు బంగారం ధరలను ఆల్‌టైమ్ గరిష్ఠాలకు పెంచుతున్నాయి. ఈ క్రమంలో దీపావళి నాటి 10 గ్రాముల పసిడి ధర రూ.లక్షకు చేరుకుంటుందనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. విదేశీ బ్రోకరేజీలు సైతం జనవరి నాటికి గోల్డ్ రేట్లు మరింతగా పెరగటానికి అనేక అంతర్జాతీయ పరిణామాలను పేర్కొన్న సంగతి తెలిసిందే.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7340, ముంబైలో రూ.7340, దిల్లీలో రూ.7355, కలకత్తాలో రూ.7340, బెంగళూరులో రూ.7340, కేరళలో రూ.7340, వడోదరలో రూ.7345, జైపూరులో రూ.7355, లక్నోలో రూ.7355, మంగళూరులో రూ.7340, నాశిక్ లో రూ.7343, అయోధ్యలో రూ.7355, బళ్లారిలో రూ.7340, గురుగ్రాములో రూ.7355, నోయిడాలో రూ.7355 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4300 పెరుగుదలను చూసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8007, ముంబైలో రూ.8007, దిల్లీలో రూ.8022, కలకత్తాలో రూ.8007, బెంగళూరులో రూ.8007, కేరళలో రూ.8007, వడోదరలో రూ.8012, జైపూరులో రూ.8022, లక్నోలో రూ.8022, మంగళూరులో రూ.8007, నాశిక్ లో రూ.8010, అయోధ్యలో రూ.8022, బళ్లారిలో రూ.8007, గురుగ్రాములో రూ.8022, నోయిడాలో రూ.8022గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7340గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8007 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7340గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8007 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.2000 పెరిగి నేడు రూ.1,12,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications