Gold Rate: బంగారం నీకో నమస్కారం..! నేడు రూ.13,100 పెరిగిన ధర.. కొంటున్నారా..
Gold Price Today: పసిడి ప్రియులైన భారతీయులకు గోల్డ్ వరుస షాక్స్ ఇస్తోంది. దేశంలో 10 గ్రాముల బంగారం రేటు ఏకంగా రూ.72వేల స్థాయిని అధిగమించటం చాలా మంది కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పైగా గందరగోళంలో ఉన్న ప్రజలు ప్రస్తుతం గోల్డ్ కొనటం వాయిదా వేసుకుంటున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నేడు 100 గ్రాములకు రూ.12,000 పెరిగి కళ్లు బైర్లు కమ్మిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పసిడి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,150, ముంబైలో రూ.65,350, దిల్లీలో రూ.65,500, కలకత్తాలో రూ.65,350, బెంగళూరులో రూ.65,350, హైదరాబాదులో రూ.65,350, కేరళలో రూ.65,350, వడోదరలో రూ.65,400, జైపూరులో రూ.65,500, మంగళూరులో రూ.65,350, నాశిక్ లో రూ.65,380, అయోధ్యలో రూ65,500, గురుగ్రాములో రూ.65,500, బళ్లారిలో రూ.65,350, నోయిడాలో రూ.65,500 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నేడు 100 గ్రాములకు ఏకంగా రూ.13,100 పెరిగి పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో చాలా మంది కొనుగోలుదారులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.72,160, ముంబైలో రూ.71,290, దిల్లీలో రూ.71,440, కలకత్తాలో రూ.71,290, బెంగళూరులో రూ.71,290, హైదరాబాదులో రూ.71,290, కేరళలో రూ.71,290, వడోదరలో రూ.71,340, జైపూరులో రూ.71,440, మంగళూరులో రూ.71,290, నాశిక్ లో రూ.71,320, అయోధ్యలో రూ.71,440, గురుగ్రాములో రూ.71,440, బళ్లారిలో రూ.71,290, నోయిడాలో రూ.71,440గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.65,350గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,290 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1,800 పెరిగి రూ.87,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications