Gold Prices Today: ఇటీవల కొంత శాంతించిన పసిడి ధరలు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత మళ్లీ అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. అయితే వారాంతంలో మాత్రం స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు కొనుగోలుదారుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర దేశంలో 10 గ్రాములకు స్వల్పంగా రూ.10 మాత్రమే నిన్నటి కంటే తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ తాజా విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,140, ముంబైలో రూ.65,740, దిల్లీలో రూ.65,890, కలకత్తాలో రూ.65,740, బెంగళూరులో రూ.65,740, కేరళలో రూ.65,740, వడోదరలో రూ.65,790, జైపూరులో రూ.65,890, నాశిక్ లో రూ.67,790, మైసూరులో రూ.65,740, అయోధ్యలో రూ.65,890, బళ్లారిలో రూ.65,740, గురుగ్రాములో రూ.65,890, గోవాలో రూ.65,740గా కొనసాగుతున్నాయి.

అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు నేడు రూ.10 తగ్గింపును నమోదు చేసింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.72,150, ముంబైలో రూ.71,720, దిల్లీలో రూ.71,870, కలకత్తాలో రూ.71,720, బెంగళూరులో రూ.71,720, కేరళలో రూ.71,720, వడోదరలో రూ.71,770, జైపూరులో రూ.71,870, నాశిక్ లో రూ.71,750, మైసూరులో రూ.71,720, అయోధ్యలో రూ.65,890, బళ్లారిలో రూ.71,720, గురుగ్రాములో రూ.71,870, గోవాలో రూ.71,720గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.65,740గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,720 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 తగ్గి రూ.86,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications