Gold Rates: అబ్బా మళ్లీ తగ్గిన బంగారం ధర.. గోల్డెన్ ఛాన్స్.. తాజా రేట్లు ఇవే..
Gold Rates: బంగారం అంటే భారతీయులకుంటే పిచ్చి మామూల్ది కాదు. కేవలం ప్రేమతో బంగారు ఆభరణాలను కొనుక్కోవటం మాత్రమే కాదు.. ప్రస్తుత అధిక ద్రవ్యోల్బణ సమయం నుంచి సంపదను రక్షించుకునేందుకు గోల్డ్ సరైన ఆయుధం.
ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల కేజీ బంగారం ధర రూ.3500 మేర తగ్గింది. ఇదే సమయంలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల కిలో గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే రూ.3800 మేర తగ్గింది. బంగారం ధరలు తగ్గటంతో అనేక మంది ఆభరణాల కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నారు.

జూన్ 15న దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,050, ముంబైలో రూ.54,700, దిల్లీలో రూ.54,850, కలకత్తాలో రూ.54,700, బెంగళూరులో రూ.54,750, కేరళలో రూ.54,700, పూణేలో రూ.54,700, లక్నోలో రూ.54,850, కోయంబత్తూరులో రూ.55,050, నాగపూర్ లో రూ.54,700, బళ్లారిలో రూ.54,750 వద్ద ఉన్నాయి.
ఇదే క్రమంలో నేడు 24 క్యారెట్ల పసిడి ధరలను దేశంలోని వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,050, ముంబైలో రూ.59,670, దిల్లీలో రూ.59,820, కలకత్తాలో రూ.59,670, బెంగళూరులో రూ.59,720, కేరళలో రూ.59,670, పూణేలో రూ.59,670, లక్నోలో రూ.59,820, కోయంబత్తూరులో రూ.60,050, నాగపూర్ లో రూ.59,670, బళ్లారిలో రూ.59,720 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, విశాఖ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, విజయనగరం వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.59,670 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.54,700 వద్ద కొనసాగుతున్నాయి. తెలంగాణలోని నగరాల్లో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే కిలోకు నిన్నటితో పోల్చితే రూ.900 తగ్గి నేడు రూ.73,100 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications