Gold Rate: భారతీయులకు టార్చర్ చూపిస్తున్న గోల్డ్ రేటు.. 3వ రోజు రూ.5,500 పెరిగిన పసిడి..
Gold Price Today: భారతదేశంలో పసిడి ఉండే డిమాండ్ అంతాఇంతా కాదు. చాలా మంది ప్రస్తుతం కార్తీకమాసంలో కొనసాగుతున్న శుభకార్యాలతో పాటు పెళ్లిళ్ల సీజన్ పీక్ లో ఉండటంతో చాలా మంది వెండి, బంగారు ఆభరణాల కొనుగోలు చేస్తున్నారు. అయితే గతవారం నిరంతరం తగ్గిన పసిడి ధరలతో ఆనందంలో ఉన్న కొనుగోలుదారులు ప్రస్తుతం మూడు రోజులుగా పెరుగుతున్న రేట్లతో ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఇవాళ కొనుగోలు కోసం వెళుతున్నట్లయితే పెరిగిన తాజా రేట్లను తప్పకుండా పరిశీలించాల్సిందే.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5,000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7115, ముంబైలో రూ.7115, దిల్లీలో రూ.7130, కలకత్తాలో రూ.7115, బెంగళూరులో రూ.7115, కేరళలో రూ.7115, పూణేలో రూ.7115, వడోదరలో రూ.7120, అహ్మదాబాదులో రూ.7120, జైపూరులో రూ.7081, లక్నోలో రూ.7081, కోయంబత్తూరులో రూ.7066, మంగళూరులో రూ.7066, నాశిక్ లో రూ.7069, అయోధ్యలో రూ.7081, బళ్లారిలో రూ.7066, గురుగ్రాములో రూ.7081 వద్ద విక్రయించబడుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే 100 గ్రాములకు ఏకంగా రూ.5,500 పెరిగింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7762, ముంబైలో రూ.7762, దిల్లీలో రూ.7777, కలకత్తాలో రూ.7762, బెంగళూరులో రూ.7762, కేరళలో రూ.7762, పూణేలో రూ.7762, వడోదరలో రూ.7767, అహ్మదాబాదులో రూ.7767, జైపూరులో రూ.7723, లక్నోలో రూ.7723, కోయంబత్తూరులో రూ.7708, మంగళూరులో రూ.7708, నాశిక్ లో రూ.7069, అయోధ్యలో రూ.7723, బళ్లారిలో రూ.7708, గురుగ్రాములో రూ.7723, నోయిడాలో రూ.7723 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7115గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7762 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7115గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7762 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 పెరిగి రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications