Gold Price Today: పసిడి ధరలు రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న భారీ తగ్గింపుకు గురైన పసిడి ధరలు నేడు తిరిగి పుంజుకోవటం వారాంతంలో షాపింగ్ చేయటానికి వేళ్లేవారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే 24 క్యారెట్ల గోల్డ్ ధరలు తక్కువ పెరగగా.. 22 క్యారెట్ల పసిడి ధరలు భారీగా పెరిగాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8045, ముంబైలో రూ.8045, దిల్లీలో రూ.8060, కలకత్తాలో రూ.8045, బెంగళూరులో రూ.8045, కేరళలో రూ.8045, వడోదరలో రూ.8050, అహ్మదాబాదులో రూ.8050, జైపూరులో రూ.8029, లక్నోలో రూ.8029, మంగళూరులో రూ.8045, నాశిక్ లో రూ.8048, అయోధ్యలో రూ.8060, బళ్లారిలో రూ.8045, గురుగ్రాములో రూ.8060, నోయిడాలో రూ.8060 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.200 స్వల్ప పెరుగుదలను చూశాయి. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ ధరలను గమనిస్తే .. గ్రాముకు చెన్నైలో రూ.8777, ముంబైలో రూ.8777, దిల్లీలో రూ.8792, కలకత్తాలో రూ.8777, బెంగళూరులో రూ.8777, కేరళలో రూ.8777, వడోదరలో రూ.8782, అహ్మదాబాదులో రూ.8782, జైపూరులో రూ.8754, లక్నోలో రూ.8754, మంగళూరులో రూ.8777, నాశిక్ లో రూ.8780, అయోధ్యలో రూ.8792, బళ్లారిలో రూ.8777, గురుగ్రాములో రూ.8792, నోయిడాలో రూ.8792గా ఉన్నాయి.
వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై వాణిజ్య పన్నులను వరుసగా ప్రకటిస్తున్న వేళ సెంట్రల్ బ్యాంకుల నుంచి ఇప్పటికే సేఫ్ హెవెన్ గోల్డ్ కోసం నిరంతరం డిమాండ్ పెరుగుతూనే ఉంది. దీనికి తోడు చరిత్రలో తొలిసారిగా అమెరికా దిగ్గజ బ్యాంకులైన హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గన్ ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి తమ పసిడి నిల్వలను భౌతికంగా వెనక్కి తీసుకున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం పసిడి ధర ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ భారీగా ధర పెరుగుతూ భవిష్యత్తు ధరలపై క్లారిటీ వస్తోంది.
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8045గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8777 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,08,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

Gold rates: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి పరుగు! హైదరాబాద్, బెంగళూరులో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications