Gold Price Today: రోజులు గడుస్తున్న కొద్ది పసిడి ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. దీంతో భారతీయ పసిడి ప్రియులు నిరాశకు గురవుతున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాలు బంగారంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరగటమే తాజా రేట్ల పెంపుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ క్రమంలో నేడు 22 క్యారెట్ల బంగారం రేటు నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.3000 పెరిగి కొనుగోలుదారులకు కునుకులేకుండా చేస్తోంది. ఇక దేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,600, ముంబైలో రూ.65,650, దిల్లీలో రూ.65,800, కలకత్తాలో రూ.65,650, బెంగళూరులో రూ.65,650, కేరళలో రూ.65,650, వడోదరలో రూ.65,700, జైపూరులో రూ.65,800, మంగళూరులో రూ.65,650, నాశిక్ లో రూ.65,680, అయోధ్యలో రూ.65,800, నోయిడాలో రూ.65,800, గురుగ్రాములో రూ.65,800గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రామలుకు రూ.3,300 పెరిగి షాక్ కొట్టిస్తోంది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.72,650, ముంబైలో రూ.71,620, దిల్లీలో రూ.71,770, కలకత్తాలో రూ.71,620, బెంగళూరులో రూ.71,620, కేరళలో రూ.71,620, వడోదరలో రూ.71,670, జైపూరులో రూ.71,770, మంగళూరులో రూ.71,620, నాశిక్ లో రూ.71,650, అయోధ్యలో రూ.71,770, నోయిడాలో రూ.71,770, గురుగ్రాములో రూ.71,770గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.65,650గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,620 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1,000 పెరిగి రూ.88,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications