Gold Price Today: గతనెల వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గోల్డ్ దిగుమతి పన్ను రేట్లను తగ్గించటంతో ధరల పతనం కనిపించింది. అయితే ప్రస్తుతం శ్రావణమాసంలో శుభకార్యాలతో పాటు త్వరలోనే రాఖీ పండుగ దగ్గర పడుతున్న వేళ తిరిగి గోల్డ్ రేట్లు భారీగా పెరగటం భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.9500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6565, ముంబైలో రూ.6565, దిల్లీలో రూ.6580, కలకత్తాలో రూ.6565, బెంగళూరులో రూ.6565, కేరళలో రూ.6565, వడోదరలో రూ.6570, జైపూరులో రూ.6580, లక్నోలో రూ.6580, మంగళూరులో రూ.6565, నాశిక్ లో రూ.6568, అయోధ్యలో రూ.6580, నోయిడాలో రూ.6580, గురుగ్రాములో రూ.6580, బళ్లారిలో రూ.6565గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్లో గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.10,400 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.7162, ముంబైలో రూ.7162, దిల్లీలో రూ.7177, కలకత్తాలో రూ.7162, బెంగళూరులో రూ.7162, కేరళలో రూ.7162, వడోదరలో రూ.7167, జైపూరులో రూ.7177, లక్నోలో రూ.7177, మంగళూరులో రూ.7162, నాశిక్ లో రూ.7165, అయోధ్యలో రూ.7177, నోయిడాలో రూ.7177, గురుగ్రాములో రూ.7177, బళ్లారిలో రూ.7162గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6565గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7162 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,000 పెరిగి రూ.88,500 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications