బంగారం కొనాలా.. వెండి కొనాలా.. భారీ పతనం తర్వాత ఇన్వెస్టర్లకు నిపుణులు ఏం సలహా ఇస్తున్నారంటే..

Gold and Silver Prices Tumble: సుదీర్ఘ కాలం పాటు నిద్రాణంగా ఉండి, ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక రికార్డులను సృష్టించిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ గరిష్ఠ స్థాయిల నుండి భారీగా దిగివచ్చాయి. 2026 జనవరి 29న దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,76,306 వద్ద, కిలో వెండి ధర రూ. 3,84,632 వద్ద ఆల్-టైమ్ రికార్డులను నమోదు చేశాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 5,602 డాలర్లు, వెండి 121 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరాయి.

అయితే, అప్పటి నుండి అమెరికా డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధానాల కారణంగా ఈ రెండు లోహాలు భారీ దిద్దుబాటుకు లోనయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 30 శాతం తగ్గి 3,895 డాలర్లకు, వెండి ఏకంగా 59 శాతం పతనమై 50 డాలర్లకు చేరుకుంది. దేశీయ మార్కెట్లో బంగారం 22 శాతం క్షీణించి రూ. 1,37,308 వద్ద ఉండగా, వెండి తన విలువలో సగానికి పైగా అంటే 53 శాతం కోల్పోయి కిలో రూ. 1,81,073 వద్ద ట్రేడవుతోంది.

Gold silver price crash gold silver prices fall 53 silver price correction gold price outlook silver price forecast buy gold now buy silver now precious metals investment gold silver expert opinion MCX gold silver bullion market outlook gold silver downside risk 53

ఈ పతనానికి ప్రధాన కారణం అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు భయాలేనని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్‌తో ఎటువంటి శాంతి ఒప్పందం అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో ముడిచమురు ధరలు ఎగబాకి, ద్రవ్యోల్బణం ఆందోళనలను మరింత పెంచాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు.

దీనికి తోడు అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను మరింత పెంచాల్సి రావచ్చని న్యూయార్క్ ఫెడ్ అధ్యక్షుడు జాన్ విలియమ్స్ సంకేతాలు ఇచ్చారు. సీఎంఈ ఫెడ్‌వాచ్ టూల్ ప్రకారం, డిసెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెరిగేందుకు 88 శాతం, 50 బేసిస్ పాయింట్లు పెరిగేందుకు 12 శాతం అవకాశం ఉందని మార్కెట్ అంచనా వేస్తోంది. బంగారం, వెండి ఎలాంటి వడ్డీ ఆదాయాన్ని ఇవ్వవు కాబట్టి, అధిక వడ్డీ రేట్లు మరియు పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ వీటి ఆకర్షణను తగ్గిస్తున్నాయి.

Also Read

మరోవైపు, గురువారం నాటి తీవ్ర అమ్మకాల తర్వాత బంగారం ధరలు ఇప్పుడు "ఓవర్‌సోల్డ్" (Oversold) జోన్‌లోకి ప్రవేశించాయని, ఔన్సుకు 3,850 డాలర్ల వద్ద బలమైన మద్దతు ఉందని విస్డమ్‌ట్రీ కమోడిటీ స్ట్రాటజిస్ట్ నితేష్ షా అభిప్రాయపడ్డారు. ఇక పెట్టుబడిదారులు ప్రస్తుతం బంగారం లేదా వెండిలో దేనిని ఎంచుకోవాలనే విషయంపై నిపుణులు స్పష్టమైన విశ్లేషణ ఇస్తున్నారు. బంగారంతో పోలిస్తే వెండిలో అస్థిరత, నష్టభయం చాలా ఎక్కువగా ఉంటాయని జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ తెలిపారు.

బంగారం కేవలం 'విలువ నిధి'గా (Store of Value) పరిగణించబడుతుండగా.. వెండి విలువ నిధితో పాటు కీలకమైన 'పారిశ్రామిక లోహం'గా కూడా ఉపయోగపడుతుంది. ఫలితంగా పారిశ్రామిక డిమాండ్‌లో వచ్చే హెచ్చుతగ్గులు వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకే గరిష్ఠ స్థాయిల నుండి బంగారం 22 శాతం మాత్రమే తగ్గగా, వెండి 53 శాతం మేర కుప్పకూలింది. కాబట్టి అధిక రిస్క్ భరించలేని దీర్ఘకాలిక మదుపర్లకు ప్రస్తుత తగ్గుదల వద్ద వెండి కంటే బంగారమే అత్యంత సురక్షితమైన, ఉత్తమమైన పెట్టుబడి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+