బంగారం, వెండి కొనేవారికి బిగ్ అలర్ట్.. ఈ వారంలో ధరలు ఇంకా పెరిగే అవకాశం.. కారణాలు ఇవే...

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక, రాజకీయ పరిణామాలు బంగారం, వెండి ధరలను మళ్లీ రికార్డు స్థాయిల వైపు నడిపిస్తున్నాయి. ఈ వారంలో కూడా పసిడి, వెండి ధరలు తమ పెరుగుదల ధోరణిని (Bullish Trend) కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటికే గరిష్ట స్థాయిలకు చేరిన ధరల వద్ద కొంతమంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) పాల్పడే అవకాశం ఉందని.. ఇది ధరల పరుగు వేగాన్ని కొంతవరకు మందగించేలా చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గడిచిన వారంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 5.13 శాతం లాభపడి 10 గ్రాములకు దాదాపు రూ.1.62 లక్షల వద్ద స్థిరపడింది. మరోవైపు పరిశ్రమల్లో డిమాండ్ కలిగిన వెండి కూడా 4.52 శాతం పెరిగి కిలోగ్రాముకు రూ. 2.46 లక్షల మార్కును చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ అయిన యూఎస్ కామెక్స్ (COMEX)లో డిసెంబర్ డెలివరీ Gold ఫ్యూచర్స్ ఔన్సుకు 5.5 శాతం పెరిగి 4,680.6 డాలర్ల వద్ద ముగియగా, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 7 శాతం దాకా పెరిగి ఔన్సుకు 69.53 డాలర్ల వద్ద ముగిసింది.

gold silver price outlook gold price prediction silver price prediction gold silver rally bullion market outlook gold prices today silver prices today key US economic data inflation data Fed rate outlook MCX gold MCX silver gold investment silver investment buy gold or wait gold silver market update Gold Silver Price Outlook Gold Price Prediction Silver Price Prediction Gold Silver Rally

ఈ ర్యాలీ వెనుక అమెరికా ఆర్థిక విధానాలు కీలక పాత్ర పోషించాయి. దీర్ఘకాలిక బాండ్ల పునఃకొనుగోళ్లను (Bond Buybacks) మరింత పెంచుతూ ద్రవ్య లభ్యతకు ఊతమిచ్చే చర్యలను యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకటించిన తర్వాత మార్కెట్‌లో Gold ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. బాండ్ల రాబడులు (Yields) తగ్గడం, కొత్తగా బులియన్ కొనుగోళ్లు పెరగడం, ద్రవ్య లభ్యత మెరుగుపడటం వంటివి బంగారం, వెండి ధరలను పరుగులు తీయించాయని రీసెర్చ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also Read

రాబోయే రోజుల్లో బులియన్ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రధానంగా అమెరికా ఆర్థిక గణాంకాలు, భౌగోళిక రాజకీయాలు నిర్దేశించనున్నాయి. ముఖ్యంగా యూఎస్ కోర్ పీసీఈ (Core PCE) ద్రవ్యోల్బణ గణాంకాలు, జీడీపీ (GDP) డేటా రాబోతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. అలాగే పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ సంక్షోభం, శాంతి ఒప్పందం దిశగా వేసే అడుగులు, వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి అంశాలపై గ్లోబల్ మార్కెట్ దృష్టి సారించింది.

వీటికి తోడు ఆగస్టు 27 నుండి 29 వరకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న 'జాక్సన్ హోల్' (Jackson Hole) ఆర్థిక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్ కెవిన్ వార్ష్ తన మొదటి కీలకోపన్యాసం చేయనుండటంతో.. రాబోయే వడ్డీ రేట్ల తగ్గింపు విధానాలపై ఫెడ్ ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే దానిపై బులియన్ ట్రేడర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే వారంలో అంతర్జాతీయ అంశాలు సానుకూలంగా ఉంటే పసిడి.. వెండి ధరల బుల్లిష్ ర్యాలీ మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+