Gold Price Today: షాకిస్తున్న బంగారం ధర.. మళ్లీ పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..
Gold Price Today: బంగారం ధరల వరుస పతనానికి బ్రేక్ పడింది. ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం రేట్లు మారాయి.
22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.150 మేర పెరిగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,520, ముంబైలో రూ.55,150, దిల్లీలో రూ.55,300, కలకత్తాలో రూ.55,150, బెంగళూరులో రూ.55,150, కేరళలో రూ.55,150, వడోదరలో రూ.55,200, జైపూర్ లో రూ.55,300, నాశిక్‌లో రూ.55,180 వద్ద కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు స్వల్పంగా రూ.160 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా నగరాల్లో రిటైల్ గోల్డ్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.60,570, ముంబైలో రూ.60,160, దిల్లీలో రూ.60,320, కలకత్తాలో రూ.60,160, బెంగళూరులో రూ.60,160, కేరళలో రూ.60,160, వడోదరలో రూ.60,220, జైపూర్ లో రూ.60,320, నాశిక్‌లో రూ.60,190 వద్ద ఉన్నాయి.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగరాలైన విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ ధర రూ.60,160గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో సైతం ఏపీలోని రేట్లే కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ.400 పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి రేటు రూ.80,400గా విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications