Gold Price Today: ముచ్చెమటలు పట్టిస్తున్న పసిడి రేటు.. మళ్లీ పెరిగిన గోల్డ్..
Gold Rate Today: నిన్న తగ్గిన బంగారం ధర నేడు మళ్లీ ఊపందుకుంది. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాల రీత్యా గోల్డ్ రేటు 6 నెలల గరిష్ఠాలకు చేరుకోవటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.200 మేర పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి తాజా రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,500, ముంబైలో రూ.57,700, దిల్లీలో రూ.57,850, కలకత్తాలో రూ.57,700, కేరళలో రూ.57,700, వడోదరలో రూ.57,750, జైపూరులో రూ.57,850, కోయంబత్తూరులో రూ.58,500, పాట్నాలో రూ.57,750, మంగళూరులో రూ.57,700, నాశిక్‌లో రూ.57,730, బళ్లారిలో రూ.57,700, గురుగ్రామ్‌లో రూ.57,850, నోయిడాలో రూ.57,850 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.220 పెరిగింది. ఈ క్రమంలో ముఖ్యమైన వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,820, ముంబైలో రూ.62,590, దిల్లీలో రూ.63,100, కలకత్తాలో రూ.62,590, కేరళలో రూ.62,590, వడోదరలో రూ.63,000, జైపూరులో రూ.57,850, కోయంబత్తూరులో రూ.63,820, పాట్నాలో రూ.63,000, మంగళూరులో రూ.62,590, నాశిక్‌లో రూ.62,970, బళ్లారిలో రూ.62,590, గురుగ్రామ్‌లో రూ.63,100, నోయిడాలో రూ.63,100 వద్ద ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖ, అనంతపురం, కాకినాడ, కడప, నెల్లూరు, తిరుపతి, హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,700గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,950గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వెండి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.300 పెరగటంతో రూ.82,500గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications