Gold Price Today: ధరలతో షాకిస్తున్న బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో మారిన రేట్లు ఇవే..
Gold News: బంగారం ధరలు భారతీయ కొనుగోలు దారులకు వరుసగా షాక్ ఇస్తోంది. గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న ధరలు పండుగ సీజన్లో నిరాశకు గురిచేస్తున్నాయి. ఒకపక్క యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నప్పటికీ గోల్డ్ పెరుగుతూనే ఉంది.
ఈ క్రమంలో బంగారం ధరలు దాదాపు 5 నెలల గరిష్ఠాలకు చేరుకున్నాయి. 22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.150 పెరిగింది. ఈ క్రమంలో ప్రధాన నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,000, ముంబైలో రూ.56,800, దిల్లీలో రూ.56,950, కలకత్తాలో రూ.56,800, బెంగళూరులో రూ.56,800, పూణేలో రూ.56,800, కేరళలో రూ.56,800, వడోదరలో రూ.56,850, జైపూర్ లో రూ.56,950, మధురైలో రూ.57,000, నాశిక్ లో రూ.56,830, బళ్లారిలో రూ.56,800, గురుగ్రామ్ లో రూ.56,950గా కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.160 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.62,200, ముంబైలో రూ.61,960, దిల్లీలో రూ.62,110, కలకత్తాలో రూ.61,960, బెంగళూరులో రూ.61,960, పూణేలో రూ.61,960, కేరళలో రూ.61,960, వడోదరలో రూ.62,010, జైపూర్ లో రూ.62,110, మధురైలో రూ.62,200, నాశిక్ లో రూ.61,990, బళ్లారిలో రూ.61,960, గురుగ్రామ్ లో రూ.62,110గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, వైజాగ్, గుంటూరు, కడప, అనంతపురం, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్, నిజాంబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,800గా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.61,960 చొప్పున రిటైల్ మార్కెట్లో కొనసాగుతోంది. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణలో వెండి ధరలను పరిశీలిస్తే నేడు కేజీకి రూ.500 పెరిగి రూ.78,000 వద్ద రిటైల్ విక్రయ జరుగుతోంది.


Click it and Unblock the Notifications