Gold: ప్లీజ్ కొనుక్కోమంటూ వెంటపడుతున్న గోల్డ్.. సేమ్ రూట్ ఫాలో అవుతున్న సిల్వర్..!!
Gold Price Today: ప్రస్తుతం దేశంలోని పసిడి ప్రియులకు మంచి కాలం నడుస్తోంది. ఇటీవల అంతరీక్షానికి చేరుకున్న గోల్డ్, సిల్వర్ రేట్లు ఒక్కసారిగా కిందకు జారిపడ్డాయి. దీంతో చాలా మంది షాపింగ్ చేసేందుకు తొందర పడుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు 10 గ్రాములకు రూ.400 క్షీణించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,150, ముంబైలో రూ.57,450, దిల్లీలో రూ.57,600, కలకత్తాలో రూ.57,450, కేరళలో రూ.57,450, పూణేలో రూ.57,450, వడోదరలో రూ.57,500, అహ్మదాబాదులో రూ.57,500, మధురైలో రూ.58,150, మంగళూరులో రూ.57,450, నాశిక్ లో రూ.57,480, మైసూరులో రూ.57,450, గురుగ్రామ్ లో రూ.57,600, నోయిడాలో రూ.57,600గా కొనసాగుతోంది.

24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.440 మేర క్షీణించింది. దీంతో ప్రధాన నగరాల్లో తగ్గిన నేటి రిటైల్ వాస్తవ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,440, ముంబైలో రూ.62,670, దిల్లీలో రూ.62,820, కలకత్తాలో రూ.62,670, కేరళలో రూ.62,670, పూణేలో రూ.62,670, వడోదరలో రూ.62,720, అహ్మదాబాదులో రూ.62,720, మధురైలో రూ.63,440, మంగళూరులో రూ.62,670, నాశిక్ లో రూ.62,700, మైసూరులో రూ.62,670, గురుగ్రామ్ లో రూ.62,820, నోయిడాలో రూ.62,820గా ఉన్నాయి.
ఇక చివరిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు, గుంటూరు, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,450గా ఉండగా.. 24 క్యారెట్ల రిటైల్ విక్రయ ధర రూ.62,700గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణలో తగ్గిన వెండి రిటైల్ ధరలను పరిశీలిస్తే కేజీ రేటు రూ.81,000గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications