Gold Rates: నిన్న స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు నేడు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. విలువైన ఖనిజాల్లో ఒకటిగా ఉన్న బంగారం అంటే భారతీయుల అమిత ప్రీతి. అందుకే డిమాండ్ బట్టి ధరల్లో మార్పులు వస్తుంటాయి.
ఈరోజు 22 గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే 10 గ్రాములకు ధర స్వల్పంగా రూ.100 మేర పెరిగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,600, ముంబైలో రూ.54,250, దిల్లీలో రూ.54,400, కలకత్తాలో రూ.54,250, బెంగళూరులో రూ.54,250, కేరళలో రూ.54,250, వడోదరలో రూ.54,300, జైపూర్ లో రూ.54,400, అహ్మదాబాదులో రూ.54,300, మధురైలో రూ.54,600, పాట్నాలో రూ.54,300 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు నేడు 100 రూపాయల మేర పెరిగింది. దేశవ్యాప్తంగా నగరాల్లో తాజా విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.59,560, ముంబైలో రూ.59,160, దిల్లీలో రూ.59,320, కలకత్తాలో రూ.59,160, బెంగళూరులో రూ.59,160, కేరళలో రూ.59,160, వడోదరలో రూ.59,220, జైపూర్ లో రూ.59,320, అహ్మదాబాదులో రూ.59,220, మధురైలో రూ.59,560, పాట్నాలో రూ.59,220 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రయ ధరలను పరిశీలిస్తే.. ఏపీలోని విజయవాడ, నెల్లూరు, గుంటూరు, అనంతపురం, తిరుపతి, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,250 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,160గా ఉంది. తెలంగాణ నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కిలోకు రూ.800 మేర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.75,800గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications