బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. 4 నెలల నంచి బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం బంగారం ధరలో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. పుత్తడి ధర ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతోంది. గత వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,520 మేరకు తగ్గింది. అయితే శుక్రవారం బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.446 పెరిగి రూ.73,746కు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.89,170 ఉండగా, శుక్రవారం నాటికి రూ.658 పెరిగి రూ.89828కు చేరింది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.73,746గా ఉంది. కిలో వెండి ధర రూ.89,828గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,990 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,720 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 65,740 గా ఉంది. కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 65740 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల రూ. 7172 గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,240, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 72270 గా ఉంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,746గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2301 డాలర్లుగా ఉంది. అది శుక్రవారం నాటికి 21 డాలర్లు పెరిగి 2321 డాలర్లకు ట్రేడవుతోంది. బంగారం స్వచ్ఛతను బట్టి ధర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం అంటే ఫ్యూర్ గోల్డ్.. 22 క్యారెట్ల బంగారం అంటే అందులో ఇతర లోహలు కలిపి ఉంటుంది.


Click it and Unblock the Notifications