Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
శుక్రవారం దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం రూ.62 వేలకు పైబడి ఉండగా, వెండి కిలో ధర రూ.74 వేలకు పైగా ఉంది. దేశంలో ఉన్న బంగారం నిల్వలు, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా భారత్‌లో బంగారం ధరల్లో పెరుగుదల నమోదయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62661. వెండి కిలో ధర రూ.74709గా ఉంది.
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, గురువారం సాయంత్రం, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.62335గా ఉంది. శుక్రవారం ధర పెరిగి రూ.62661కి చేరుకుంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 230 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,000 ఉండగా 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 63,230 కు చేరుకుంది.

హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 81, 000 లుగా ఉంది. మీరు మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి ధరలను తెలుసుకోవచ్చు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు. మిస్ కాల్ ఇచ్చిన కొంత సమయం లోపు మీరు SMS ద్వారా రేటు సమాచారాన్ని పొందుతారు. అధికారిక వెబ్‌సైట్ ibjarates.comని సందర్శించడం ద్వారా ధరలు తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications