బంగారం ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. గత మార్చి, ఏప్రిల్ భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు అస్థిరంగా ఉంది. ఒక రోజు ధర పెరిగితే మరో రోజు తగ్గుతోంది. మొత్తానికి ప్రస్తుతం పుత్తడి ధర భారీగానే ఉంది. తాజాగా బంగారం ధర పెరిగింది. గురువారం రోజు పుత్తడి ధర గరిష్ఠంగా రూ.710 పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67000 గా ఉంది.
హైదరాబాద్‌లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.73090 గా ఉండగా.. తులం 22 క్యారెంట్ల పసిడి ధర రూ. రూ.67000 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.650 పెరగ్గా.. 24 క్యారెట్ల పుత్తడి తులానికి రూ.710 పెరిగింది. విజయవాడ, కరీంనగర్ లో 10 గ్రాముల 24 క్యారెంట్ల బంగారం ధర రూ. 73120 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.72,370గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాముల ధర రూ.66,340 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,490 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర సుమారు రూ.72,520 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 650 పెరిగి రూ.67600 చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 710 పెరిగి రూ.73750 ఉంది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రిటైల్ ధర 10 గ్రాములు రూ.66,390గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.72,420గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ల బలమైన ట్రెండ్‌కు అనుగుణంగా బుధవారం దేశ రాజధానిలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.50 తగ్గి రూ.72,550 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.72,500 వద్ద ముగిసింది. దేశంలో వెండి ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కేజీ వెండి ధర నిన్నటి కంటే రూ. 1500 పెరిగింది. దీంతో ఈ రోజు (జులై 7) కేజీ వెండి రూ. 93000లకు చేరింది.


Click it and Unblock the Notifications