Gold Rate Today: దీపావళి తర్వా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో 10 గ్రాముల ధర దాదాపు రూ.2,000 వరకు పెరగటం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో గోల్డ్ కొనాలనుకునే వారు షాక్ అవుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఒక్కరోజులోనే ఏకంగా రూ.750 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,700, ముంబైలో రూ.58,100, దిల్లీలో రూ.58,250, కలకత్తాలో రూ.58,100, వడోదరలో రూ.58,150, జైపూర్ లో రూ.58,250, మధురైలో రూ.58,700, పూణేలో రూ.58,150, నాశిక్ లో రూ.58,140, మైసూరులో రూ.58,100, గురుగ్రామ్‌లో రూ.58,250, బళ్లారిలో రూ.58,100గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారట్ల పసిడి 10 గ్రాముల ధర నిన్నటి కంటే రూ.820 మేర పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.64,040, ముంబైలో రూ.63,380, దిల్లీలో రూ.63,530, కలకత్తాలో రూ.63,380, వడోదరలో రూ.63,430, జైపూర్ లో రూ.63,530, మధురైలో రూ.64,040, పూణేలో రూ.63,430, నాశిక్ లో రూ.63,410, మైసూరులో రూ.63,380, గురుగ్రామ్‌లో రూ.63,530, బళ్లారిలో రూ.63,380గా నేడు కొనసాగుతున్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖ, అనంతపురం, తిరుపతి, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రిటైల్ ధర రూ.58,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,380గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రూ.700 పెరగటంతో రిటైల్ విక్రయ ధర ప్రస్తుతం రూ.82,200గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications