Gold News Today: అంతర్జాతీయంగా పెరుగుతున్న పసిడి ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకపక్క భారతదేశంలో పండుగలు దగ్గరపడుతున్న వేళ గోల్డ్ రేట్లలో దూకుడు రిటైల్ ఆభరణాల కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. స్వల్పంగా తగ్గుతూ భారీగా పెరుగుతూ బంగారం గందరగోళాన్ని సృష్టిస్తోంది.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.8,500 వృద్ధిని నమోదు చేసింది. దేశంలోని వివిధ నగరాల్లో తాజాగా పెరిగిన పసిడి నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే 10 గ్రాములకు.. చెన్నైలో రూ.64,550, ముంబైలో రూ.63,600, దిల్లీలో రూ.63,750, కలకత్తాలో రూ63,600, బెంగళూరులో రూ.63,600, కేరళలో రూ.63,600, వడోదరలో రూ.63,650, జైపూరులో రూ.63,750, నాశిక్ లో రూ.63,650, మైసూరులో రూ.63,600, అయోధ్యలో రూ.63,750, గురుగ్రాములో రూ.63,750, నోయిడాలో రూ.63,750గా కొనసాగుతున్నాయి.

అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు నేడు 100 గ్రాములకు ఏకంగా రూ.9,300 పెరిగి కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ 10 గ్రాముల ధరను గమనిస్తే.. చెన్నైలో రూ.70,420, ముంబైలో రూ.69,380, దిల్లీలో రూ.69,530, కలకత్తాలో రూ.69,380, బెంగళూరులో రూ.69,380, కేరళలో రూ.69,380, వడోదరలో రూ.69,430, జైపూరులో రూ.69,530, నాశిక్ లో రూ.69,410, మైసూరులో రూ.69,380, అయోధ్యలో రూ.69,530, గురుగ్రాములో రూ.69,530, నోయిడాలో రూ.69,530గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.63,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,380 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.600 పెరిగి రూ.81,600 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications