Gold Rate: గోల్డ్ షాకింగ్ ర్యాలీ.. నేడు ఏకంగా రూ.4,100 పెరుగుదల, ఏపీ తెలంగాణలో..
Gold Price Today: నిన్న స్వల్ప ఊరట తర్వాత నేడు పసిడి ధరలు మళ్లీ షాకింగ్ పెరుగుదలను కొనసాగిస్తున్నాయి. ఫెడ్ ప్రకటన దగ్గరపడుతున్న వేళ వడ్డీ రేట్ల తగ్గింపుపై కొనసాగుతు ఊహాగానాలు గోల్డ్ రేట్లను ఊహించని స్థాయిలకు పెంచేస్తోంది. ఇది భారతదేశంలోనూ పసిడి రేట్లను అత్యధిక స్థాయిలకు చేర్చింది. ఇది పండుగ ముందు ఆభరణాలు కొనాలనుకుంటున్న వ్యక్తులకు ఆందోళన కలిగిస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3,800 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6715, ముంబైలో రూ.6715, దిల్లీలో రూ.6730, కలకత్తాలో రూ.6715, బెంగళూరులో రూ.6715, కేరళలో రూ.6715, వడోదరలో రూ.6720, జైపూరులో రూ.6730, మంగళూరులో రూ.6715, నాశిక్ లో రూ.6718, అయోధ్యలో రూ.6730, బళ్లారిలో రూ.6715, నోయిడాలో రూ.6730, గురుగ్రాములో రూ.6730గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4,100 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో గోల్డ్ పెరిగిన రిటైల్ విక్రయ రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.7325, ముంబైలో రూ.7325, దిల్లీలో రూ.7340, కలకత్తాలో రూ.7325, బెంగళూరులో రూ.7325, కేరళలో రూ.7325, వడోదరలో రూ.7330, జైపూరులో రూ.7340, మంగళూరులో రూ.7325, నాశిక్ లో రూ.7328, అయోధ్యలో రూ.7340, బళ్లారిలో రూ.7325, నోయిడాలో రూ.7340, గురుగ్రాములో రూ.7340గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6715గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7325 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 పెరిగి రూ.91,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications