Gold Price Today: అంతర్జాతీయంగా అనేక కారణాలతో నేడు సైతం పసిడి ధరలు విపరీతమైన పెరుగుదలను నమోదు చేశాయి. వాస్తవానికి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై సానుకూల సంకేతాలతో పాటు ఇతర కారణాలతో అక్షయతృతీయ తర్వాత గోల్డ్ ధరలు మళ్లీ తిరిగి పుంజుకున్నాయి. వీటిని చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. రేట్లు ఎప్పటికి తగ్గుతాయో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రూ.లక్ష మార్కును దాటి తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారులకు కంగారు పుట్టిస్తోంది.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.5,000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలు గ్రాముకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6,900, ముంబైలో రూ.6,890, దిల్లీలో రూ.6,905, కలకత్తాలో రూ.6,890, బెంగళూరులో రూ.6,890, కేరళలో రూ.6,890, పూణేలో రూ.6,890, జైపూరులో రూ.6,905, సూరత్ లో రూ.6,895, నాశిక్ లో రూ.6,893, అయోధ్యలో రూ.6,905, బళ్లారిలో రూ.6,890, గురుగ్రాములో రూ.6,905, నోయిడాలో రూ.6,905 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.5,400 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో గ్రాముకు రిటైల్ విక్రయ ధరలు గణనీయంగా పెరిగాయి. చెన్నైలో రూ. 7,528, ముంబైలో రూ.7,516, దిల్లీలో రూ.7,531, కలకత్తాలో రూ.7,516, బెంగళూరులో రూ.7,516, కేరళలో రూ.7,516, పూణేలో రూ.7,516, జైపూరులో రూ.7,531, సూరత్ లో రూ.7,521, నాశిక్ లో రూ.7,519, అయోధ్యలో రూ.7,531, బళ్లారిలో రూ.7,516, గురుగ్రాములో రూ.7,531, నోయిడాలో రూ.7,531 వద్ద ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,890గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,516 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.3,500 పెరిగి రూ.1,01,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications