వరుసగా మూడు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం సోమవారం మరోసారి పెరిగింది. చాలా మంది బంగారం ఇంకా తగ్గే అవకాశం ఉందని భావించారు. కానీ పుత్తడి ధర మాత్రం తగ్గడం లేదు. తాజాగా బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 72,710 వద్ద కొనసాగుతోంది. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధర పెరిగింది.
MCXలో జూన్ ఫ్యూచర్స్ బంగారం 10 గ్రాములకు రూ.71496గా ఉంది. రూ.240 పెరిగింది. ఇప్పటి వరకు నేటి ట్రేడింగ్‌లో బంగారం గరిష్ట ధర రూ.71605కి చేరుకోగా, 10 గ్రాముల ధర రూ.71456 తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో వెండి ధర కిలోకు రూ. 91,825 గా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,710 ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,000 గా ఉంది.

దేశ రాజధానిలో ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ.72,860కి చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.270 పెరిగి రూ.72,710గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల24 క్యారెట్ల బంగారం రూ.710 పెరిగి రూ.73,310కి చేరుకుంది. బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.270 పెరిగి రూ.72,710కి చేరింది.
బంగారం ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి. బంగారం మార్కెట్ లో వివిధ నాణ్యతలతో లభిస్తుంది. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ఉంటుంది. ఆభరణాలు 22 క్యారెట్ల నాణ్యతతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications