Gold Price Today: పరుగులు మెుదలెట్టిన పసిడి ధర.. పెళ్లిళ్ల ఎఫెక్ట్.. తాజా ధరలు..
Gold Price Today: చాలా కాలం స్థబ్దుగా కొనసాగిన పసిడి మళ్లీ పరుగులు పెట్టడం మెుదలు పెట్టింది. ప్రస్తుతం శ్రావణమాసం మెుదలు కావటంతో చాలా మంది శుభకార్యాల కోసం బంగారం, వెండి కొనుగోలుకు మెుగ్గు చూపటమే దీనికి కారణమని బులియన్ మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు.
22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.500 పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,600, ముంబైలో రూ.54,200, దిల్లీలో రూ.54,300, కలకత్తాలో రూ.54,200, బెంగళూరులో రూ.54,200, వడోదరలో రూ.54,100, కేరళలో రూ.54,200, జైపూర్ లో రూ.54,300, కోయంబత్తూరులో రూ.54,600, పాట్నాలో రూ.54,100, నాశిక్ లో రూ.54,230 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.600 మేర పెరిగింది. వివిధ ప్రాంతాల్లో పేరిగిన రిటైల్ బంగారం ధరలను పరిగణలోకి తీసుకుంటే నేడు.. చెన్నైలో రూ.59,560, ముంబైలో రూ.59,130, దిల్లీలో రూ.59,220, కలకత్తాలో రూ.59,130, బెంగళూరులో రూ.59,130, వడోదరలో రూ.59,020, కేరళలో రూ.59,130, జైపూర్ లో రూ.59,220, కోయంబత్తూరులో రూ.59,560, పాట్నాలో రూ.59,020, నాశిక్ లో రూ.59,160గా ఉన్నాయి.
ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం రేట్లను గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనంతపురం, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,200 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,130గా ఉంది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో సైతం పైన పేర్కొన్న రేట్లే కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కిలో వెండి ధర నిన్నటి కంటే రూ.1,200 పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో తాజాగా రూ.78,000 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications