Gold Rate Today: అమెరికా డాలర్ ధర పెరగటంతో బంగారం ధరలు రెండు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. దాదాపు వారం రోజులుగా పసిడి ధరలు పడిపోతూనే ఉన్నాయి. నవరాత్రులు వస్తున్న వేళ 10 గ్రాముల ధర రూ.2000 మేర తగ్గింది. అలాగే డాలర్ బలపడుతూ పైపైకి చేరటంతో పసిడి ధరలు కిందకు పడిపోతున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.150 మేర తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ గోల్డ్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.53,356, ముంబైలో రూ.53,200, దిల్లీలో రూ.53,350, కలకత్తాలో రూ.53,200, బెంగళూరులో రూ.53,200, కేరళలో రూ.53,200, పూణేలో రూ.53,200, జైపూర్ లో రూ.53,350, పాట్నాలో రూ.53,250, నాశిక్ లో రూ.53,230, మైసూరులో రూ.53,200, గురుగ్రామ్ లో రూ.53,350, బళ్లారిలో రూ.53,200గా విక్రయించబడుతున్నాయి.

ఇదే సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర నిన్నటి కంటే రూ.160 తగ్గింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ గోల్డ్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.58,430, ముంబైలో రూ.58,040, దిల్లీలో రూ.58,190, కలకత్తాలో రూ.58,040, బెంగళూరులో రూ.58,040, కేరళలో రూ.58,040, పూణేలో రూ.58,040, జైపూర్ లో రూ.58,190, పాట్నాలో రూ.58,090, నాశిక్ లో రూ.58,070, మైసూరులో రూ.58,040, గురుగ్రామ్ లో రూ.58,350, బళ్లారిలో రూ.58,040గా ఉన్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, విశాఖ, హైదరాబాద్, నిజాంబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,200గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,040 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వెండి ధరలను గమనిస్తే కేజీకి రూ.500 తగ్గటంతో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా రూ.75,500 వద్ద విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications